Andhra Pradesh: చెంచులను మనం అసలు తోటి భారతీయులుగా గుర్తిస్తున్నామా?: పవన్ కల్యాణ్

  • యురేనియం తవ్వకాలపై పోరాడుతున్న పవన్
  • తాజాగా గిరిజన, ఆదివాసీ సమస్యలపై గళం
  • ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన జనసేనాని

నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమానికి పలువురు సినీ నటులు సైతం మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో యురేనియం వ్యతిరేక ఉద్యమంలో చేతులు కలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అసలు మనం చెంచు తెగలను తోటి భారతీయులుగా గుర్తిస్తున్నామా? అని జనసేనాని ప్రశ్నించారు.

భారత రాజ్యాంగ అసెంబ్లీలో గతంలో జరిగిన చర్చలో  ‘గిరిజనులకు ప్రజాస్వామ్యాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ల నుంచి మనం ప్రజాస్వామ్య విలువలను నేర్చుకోవాలి. ఈ భూమి మీద అత్యంత ప్రజాస్వామ్యయుతమైన వ్యక్తులు వారే’ అని చెప్పిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు.

అలాగే బిహార్ కు చెందిన గిరిజన పార్లమెంటు సభ్యుడు జైపాల్ సింగ్ గతంలో..‘పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగంలో పెట్టిన రక్షణలు కాదు మాకు కావాల్సింది. మంత్రుల నుంచి నా ప్రజలకు రక్షణ కావాలి. మాకు ఎలాంటి ప్రత్యేక వసతులు, భద్రత అక్కర్లేదు. తోటి భారతీయుల్లా మమ్మల్ని గౌరవిస్తే చాలు’ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

More Telugu News