Kodela: అయామ్ యూజింగ్ దిస్ వర్డ్... అది ఒక పెట్టీ కేస్!: చంద్రబాబు

  • కోడెలపై నమోదైంది చలాన్ వేసే కేసు మాత్రమే
  • దాన్నే పెద్దది చేసి హెరాస్ చేశారు
  • మనిషి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు

"ఒక పెట్టీ కేస్.. అయామ్ యూజింగ్ దిస్ వర్డ్... ఓ పెట్టీ కేస్... ఆ కేస్ లో... మామూలుగా పోలీసులు న్యూసెన్స్ చలాన్ వేస్తుంటారు. క్రైమ్ లు చిన్నచిన్నవి... అలాంటి కేస్ ను పెట్టుకుని, అన్నీ అటువంటివే పెట్టుకుని, ఓ వ్యక్తిని హెరాస్ చేసి, హెరాస్ చేసి, కుటుంబాన్ని చెల్లాచెదురు చేసి, కనీసం ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియని పరిస్థితి తెచ్చి, సమాజంలో... వీళ్లు ఏదో చేసేశారు. మొత్తం దోచేశారన్న ముద్ర వేసేసి... మనిషి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు. నేను ఆ కాగితాలు తెప్పిస్తున్నా" అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం హైదరాబాద్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కోడెల పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన ఆయన, అనంతరం మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. కోడెల, తన ఆస్తులపై నాలుగు లెటర్లు రాశారని అన్నారు. ఫర్నీచర్ విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానని, ఏ ప్రభుత్వం వచ్చినా, సీనియర్లకు, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి సామాగ్రిని సమకూర్చడం సర్వసాధారణమేనని అన్నారు. శివప్రసాద్, స్పీకర్ అయిన తరువాత ప్రభుత్వానికి ఓ లెటర్ రాశారని గుర్తు చేశారు. తన వద్ద హైదరాబాద్ అసెంబ్లీలో ఏపీ భాగంగా వచ్చిన ఫర్నీచర్ కొంత ఉందని చెప్పారని, కానీ, అధికారులు దాన్ని తెచ్చుకోలేదని అన్నారు.

ఇప్పుడు కూడా అసెంబ్లీ ఫర్నీచర్ ను తీసుకెళ్లిన కేసుగానీ, నరసరావు పేటలో ఎవరినో బెదిరించారని ఆయన కుటుంబీకులపై నమోదైన కేసులుగానీ చాలా చిన్నవని, వాటిని అడ్డు పెట్టుకుని, ఓ మంచి మనిషిని ఇబ్బంది పెట్టాలని చూశారని అన్నారు.

More Telugu News