Kodela: రాత్రి హైదరాబాద్ కు వస్తుంటే చాలా ఆలోచనలు వచ్చాయి... చాలా బాధేస్తోంది: చంద్రబాబునాయుడు

  • కోడెల మరణ వార్తతో దిగ్భ్రాంతి
  • సీనియర్ నేతకు వేధింపులా?
  • ఇది క్షమించరాని నేరమన్న చంద్రబాబు

తన మిత్రుడు కోడెల మరణ వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి చెందానని, ఆపై నిన్న రాత్రి హైదరాబాద్ కు వస్తుంటే, తన మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయని, వైసీపీ ప్రభుత్వం చేయబోయేది కూడా ఇదేనని చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన మనసులో చాలా బాధ, ఆవేదన, ఆవేశం వచ్చాయని అన్నారు. తనను ధైర్యంగా ఉండాలని కొంతమంది చెప్పారని అన్నారు.

ఏపీ మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లుతో ఫోన్ లో మాట్లాడానని, అసలు నిజమేంటని ఆయన అడిగితే, మీకు తెలిసిన విషయాలు ప్రిపేర్ చేసుకుని రావాలని అన్నానని చంద్రబాబు చెప్పారు. తాను కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నానని, రాష్ట్రప్రజలకు, తెలుగు జాతికి, భారత దేశానికి ఈ విషయాలు తెలియాల్సి వుందని అన్నారు.

"ఇంతవరకూ భారత దేశ చరిత్రలో ఇలాంటి కేసులో ఓ సీనియర్ నాయకుడు, 72 సంవత్సరాలు. ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఇంకో పక్కన అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మొదటి స్పీకర్ నవ్యాంధ్ర స్టేట్ కి... అలాంటి వ్యక్తికి ఇలాంటి డెత్... చాలా బాధేస్తోంది. ఆ నేపథ్యంలో... తప్పు చేసి ఎండ్ అయితే, మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. వేధించి, అవమానించి, మానసికంగా బాధపెట్టి... మనిషి చనిపోతే, అది క్షమించరాని నేరం. తప్పులు చేసిన వారు కూడా ఎస్కేప్ అవుతున్నారు" అని ఆయన అన్నారు.

More Telugu News