Talasani: కోడెల ఇలా తనువు చాలించడం బాధగా ఉంది!: తలసాని భావోద్వేగం

  • ఎన్నో విషయాల్లో మాకు మార్గదర్శకుడు
  • రాజకీయ నేతగా అపార అనుభవం
  • కోడెల మృతి తీరని లోటన్న తలసాని

కోడెల ఈ విధంగా మరణించడం తనకు చాలా బాధను కలిగిస్తోందని ఒకప్పటి ఆయన సహచరుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. కోడెల ఓ గొప్ప నాయకుడని, తామంతా ఒకే పార్టీలో ఉన్న వేళ, ఎన్నో విషయాల్లో ఆయన తమకు మార్గదర్శకుడిగా ఉన్నారని, ఏ కార్యక్రమం చేసినా, ప్రజల గురించి ఆలోచిస్తుండేవారని భావోద్వేగంతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారుండరని అన్నారు. ఓ డాక్టర్ గా, రాజకీయ నేతగా కోడెలకు అపారమైన అనుభవం ఉందని, పేదలకు వైద్యం అందిస్తూ, రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మరణం ప్రజలకు లోటని అన్నారు.

More Telugu News