Kodela: ఇంత పెద్దమనిషికే ఇలాంటి ఆలోచన వస్తే పేదవాడి పరిస్థితేంటి?: కోడెల మృతిపై వీహెచ్ వ్యాఖ్యలు

  • కోడెల బలవన్మరణంపై స్పందించిన వి.హనుమంతరావు
  • తనకు కోడెలతో సాన్నిహిత్యం ఉందన్న వీహెచ్
  • ఎలా చనిపోయాడో తెలియాల్సి ఉందంటూ వ్యాఖ్యలు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ వి.హనుమంతరావు కూడా కోడెల మృతి పట్ల విస్మయానికి గురయ్యారు. ఏపీ రాజకీయాల్లో తనకు పరిచయం లేని వారంటూ ఎవరూ లేరని, అందునా కోడెల స్పీకర్ గా, మంత్రిగా పనిచేయడంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. కోడెల ఉరివేసుకుని చనిపోయారంటున్నారని, మరి కుటుంబ కలహాలా, లేక రాజకీయ కక్షలా అనేవి తెలియడంలేదని అన్నారు.

అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఉరివేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఎవరైనా సామాన్యుడు ఉరివేసుకున్నాడంటే అప్పుల బాధతోనో, కుటుంబ సమస్యలతోనే చనిపోయాడని అనుకోవచ్చని, కానీ కోడెల వంటి మంచి వ్యక్తికి ఉరివేసుకోవాల్సిన అవసరం ఏంటని సందేహం వ్యక్తం చేశారు. ఇంత పెద్దవాడికే ఇలాంటి ఆలోచన వస్తే, ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటన్నదే తన పాయింట్ అని వీహెచ్ వ్యాఖ్యానించారు.

More Telugu News