Kodela: బ్రేకింగ్... ఉరి వేసుకుని కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం... పరిస్థితి విషమం!

  • ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం
  • హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి తరలింపు
  • ఐసీయూలో చికిత్స

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను ఐసీయూలో ఉంచిన వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. స్వయంగా శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News