Nani: లాభాల దిశగా 'నానీస్ గ్యాంగ్ లీడర్'

  • నాని తాజా చిత్రంగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్'
  • హాస్యం .. ఎమోషన్ తో కూడిన కథాకథనాలు 
  • ప్రేక్షకుల నుంచి లభిస్తోన్న ఆదరణ

నాని కథానాయకుడిగా ఈ నెల 13వ తేదీన 'గ్యాంగ్ లీడర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి 3 రోజుల్లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. నైజామ్ ఏరియాలో ఈ సినిమా 7.60 కోట్లకు అమ్ముడు కాగా, తొలి మూడు రోజుల్లోనే 4.67 కోట్లను వసూలు చేసింది. ఇక సీడెడ్ ఏరియా హక్కులు 3.60 కోట్లకు అమ్ముడు కాగా, తొలి 3 రోజుల్లో 1.43 కోట్లను రాబట్టింది.

ఒకటి రెండు ఏరియాల్లో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి చేరువగా వచ్చేసింది. రెండవ వారంలో ఈ సినిమా లాభాల దిశగా దూసుకెళ్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రెస్పాన్స్ చూసి మైత్రీ మూవీ మేకర్స్ వారు ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తోంది. సున్నితమైన హాస్యం .. ఎమోషన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతోందనే అభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి.

More Telugu News