one india one language: అమిత్‌ షా ఆలోచనలు అసాధ్యం: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌

  • భిన్నత్వమే భారత దేశం గొప్పతనం
  • అటువంటి చోట ఒకే భాష ఎప్పటికీ సాధ్యం కానిది
  • జీఎస్‌టీ విధించినంత ఈజీ కాదు

భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశమని, అటువంటి దేశంలో అమిత్‌షా అన్నట్లు ఒకే భాష అమలు ఎలా సాధ్యం అవుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేష్‌ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో జరిగిన ఎఫ్‌కేసీసీఐ సంస్థాపన దినోత్సవంలో నిన్న పాల్గొన్న ఆయన ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

కారణం ఏదైనా ఒక దేశం, ఒకే భాష అమలు చేయడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. దేశంలో విభిన్న భాషలు, ప్రాంతాల వారీ సంస్కృతి శతాబ్దాల కాలంగా కొనసాగుతోందని గుర్తు చేశారు. విభిన్న భాషలు సంస్కృతులు వైవిధ్యమైన ఐక్యతను మార్చాలనుకుంటే పొరపాటు చేసినట్టు అవుతుందన్నారు. జీఎస్టీ అమలు చేశారనేది నిజమే అయినా సంప్రదాయ దేశంలో ఒకే భాష అమలు చేయడం సాధ్యం కాదన్నారు.

More Telugu News