Lemon: చరిత్రలో తొలిసారి... నిమ్మకాయల బస్తా రూ. 16 వేలు!

  • చుక్కలు చూపిస్తున్న నిమ్మకాయలు
  • ఆదివారం నాడు లూజు బస్తా ధర రూ. 16 వేలకు
  • దిగుబడి తగ్గడంతోనేనంటున్న నిపుణులు

మొన్న టమోటాలు, నిన్న ఉల్లిపాయలు, నేడు నిమ్మకాయలు... మధ్య తరగతికి చుక్కలు చూపించేలా కూరగాయల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిమ్మకాయల లూజు బస్తా ధర రూ. 16 వేలకు చేరింది. ఈ సంవత్సరం ఆది నుంచి బస్తా ధర రూ. 3 వేల నుంచి రూ. 12 వేల మధ్య నడుస్తూ ఉండగా, నాలుగో తేదీన రూ. 15 వేలకు వెళ్లింది.

గూడూరులో బస్తా రూ. 15 వేలకు చేరుకుందని తెలుసుకున్న తెలంగాణలోని నల్గొండ, నకిరేకల్, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కాయలు విపరీతంగా రావడంతో, ఒక్కరోజులోనే బస్తాపై ధర రూ. 6 వేలకు పైగా తగ్గింది. ఇక, శనివారం లూజు బస్తా ధర రూ. 15,500 పలికింది. ఆపై ఆదివారం నాడు నాణ్యమైన నిమ్మకాయల ధర ఏకంగా రూ. 16 వేలకు వెళ్లింది. కిలో నిమ్మకాయల ధర రూ. 200 వరకూ వెళ్లింది.

తీవ్ర వర్షాభావంతో నిమ్మ చెట్ల నుంచి దిగుబడి గణనీయంగా పడిపోవడంతోనే ఇలా జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిత్యమూ ఒక్కో కొట్టుకు రోజుకు 50 నుంచి 150 బస్తాల వరకూ వచ్చే పంట, ప్రస్తుతం 5 బస్తాలకు పరిమితమైందని, ఆందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.

More Telugu News