Maharashtra: మెట్రో కోసం ఆ అటవీ ప్రాంతంలోని చెట్ల నరికివేత తప్పదు: 'మహా' సీఎం దేవేంద్ర ఫడ్నవిస్

  • మెట్రో కార్ షెడ్ నిర్మాణం కోసం 2700 చెట్లు నరికివేయాలని నిర్ణయం
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
  • అభివృద్ధి కూడా ముఖ్యమన్న ముఖ్యమంత్రి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటవీ ప్రాంతంలోని చెట్ల నరికివేతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మెట్రో కార్ షెడ్ నిర్మాణం కోసం ముంబై శివారు అరే కాలనీకి చెందిన 2,700 చెట్లను నరికివేయాలని నిర్ణయించినట్టు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. చెట్లను నరికివేయాలని నిర్ణయించిన ప్రాంతం 13 వేల హెక్టార్లలో విస్తరించింది. ఈ కారిడార్ లో మొత్తం 27 ఆదివాసీ గ్రామాలున్నాయి.

చెట్ల నరికివేత నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. అరే సబర్బన్ ప్రాంతంలో చెట్లను రక్షించి నగరాన్ని పచ్చగా ఉంచాలని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ఆమెకు పలువురు మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసించారు. వెల్లువెత్తుతున్న నిరసనలపై ముఖ్యమంత్రి ఫడ్నవిస్ స్పందించారు. చెట్లు నరకకూడదనే తాము భావిస్తున్నామని అయితే, అభివృద్ధి కూడా ముఖ్యమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. నరికివేసిన చెట్ల స్థానంలో మరిన్ని మొక్కలు నాటుతామని సీఎం స్పష్టం చేశారు. చెట్ల నరికివేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆదిత్య థాకరేతో తాను స్వయంగా మాట్లాడతానని ఫడ్నవిస్ పేర్కొన్నారు.  

More Telugu News