Godavari: గోదావరిలో ఘోరం... ఫ్లడ్ లైట్ల వెలుగులో కొనసాగుతున్న సహాయ చర్యలు

  • తూర్పుగోదావరి జిల్లాలో పడవ మునక
  • అనేక మంది గల్లంతు
  • కొనసాగుతున్న గాలింపు చర్యలు

గోదావరి నదిలో ఓ పర్యాటక బోటు మునిగిపోవడం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ బోటులో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఈ ప్రమాదం జరగ్గా,  అనేకమంది గల్లంతయ్యారు. కొందరు సురక్షితంగా బయటపడగా, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో ఫ్లడ్ లైట్ల వెలుగులో సహాయ చర్యలు చేపడుతున్నారు.

గాలింపు చర్యల్లో 2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. 6 అగ్నిమాపక బృందాలు, నేవీ గజ ఈతగాళ్లు కూడా కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే 2 హెలికాప్టర్లు, 8 బోట్లు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. రేపు ఉత్తరాఖండ్ నుంచి మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తూర్పుగోదావరి జిల్లాకు రానున్నాయి. మృతదేహాల కోసం సైడ్ స్కాన్ సోనార్ వ్యవస్థతో గాలింపు చర్యలు చేపట్టనున్నారు.

More Telugu News