Sujana Chowdary: రాజధాని విషయంలో సుజనా చౌదరి అనే పెద్ద రైతు ఆందోళనలో ఉన్నారా?: అంబటి సెటైర్లు

  • సుజనా, లింగమనేని అనే పెద్ద రైతులు ఆందోళనలో ఉన్నారా?
  • లోకేశ్ రైతు, ఆయనకు బినామీ రైతులూ ఉన్నారు
  • రైతుల వేషాల్లో సూట్లు వేసుకుని తిరుగుతున్నారు

ఏపీ రాజధాని అమరావతి విషయమై రైతులు ఆందోళన చెందుతున్నారన్న వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. తాడేపల్లిలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, సుజనా చౌదరి, లింగమనేని అనే పెద్దరైతులు ఆందోళనలో ఉన్నారా? ఏ రైతులు వీళ్లందరూ? బాగా పెద్ద రైతులే, ఈ రైతుల ఆందోళన తీర్చాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ‘చాలా మంది రైతులు ఉన్నారు. లోకేశ్ రైతు గారు కూడా ఉన్నారు. ఆయనకు బినామీ రైతులు కొంతమంది ఉన్నారు. ఈ రాజధానిలో రైతుల వేషాల్లో సూట్లు వేసుకుని తిరుగుతున్న మీకు ఉన్న పొలాల సంగతి ఎవరికి తెలియదు!’ అని విమర్శించారు.  

More Telugu News