Narendra Modi: మోదీపై పాముల్ని ప్రయోగిస్తానని చెప్పిన పాక్ గాయనికి లీగల్ చిక్కులు!

  • వీడియోలో ప్రమాదకర సర్పాలతో కనిపించిన పాప్ సింగర్ రబీ పీర్జాదా
  • చట్టం ఉల్లంఘనే అంటున్న పాక్ పంజాబ్ ప్రావిన్స్ అటవీశాఖ
  • రబీ పీర్జాదాకు నోటీసులు

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత భారత ప్రభుత్వంపై పాకిస్థాన్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాకిస్థాన్ లో ప్రముఖ పాప్ గాయనిగా పేరుపొందిన రబీ పీర్జాదా కూడా దీనిపై స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రమాదకర సర్పాలను ప్రయోగిస్తానని, ఆయన నరకానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఓ వీడియోలో పాములు, మొసళ్లతో దర్శనమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే, ఈ వీడియోలో ఆమె ఉపయోగించింది వన్యప్రాణులు కావడంతో ఈ విషయాన్ని పాక్ పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన అటవీశాఖ తీవ్రంగా పరిగణించింది. నిషేధిత వన్యప్రాణులను కలిగివుందన్న కారణంగా రబీ పీర్జాదాకు నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో ఉల్లంఘన నిరూపితమైతే రెండు లేదా మూడేళ్లు జైలు శిక్ష కానీ, రూ.20,000 వరకు జరిమానా కానీ చెల్లించాల్సి ఉంటుంది.

More Telugu News