India: ఈ ఏడాది 2050 సార్లు పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది: విదేశాంగ శాఖ వెల్లడి

  • 2003లో భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
  • ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తున్న పాక్
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న భారత విదేశాంగ శాఖ

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, అది అమలవుతున్న దాఖలాలు లేవు. అందుకు కారణం పాకిస్థానే అని భారత విదేశాంగ శాఖ ఆరోపిస్తోంది. సరిహద్దుల వెంబడి ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్థాన్ బలగాలు 2050 సార్లకు పైగా ఉల్లంఘనలకు పాల్పడినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు.

ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకపోయినా పాకిస్థాన్ వైపు నుంచి అమాయక ప్రజలను, సరిహద్దు సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కాల్పుల్లో 21 మంది భారతీయులు మరణించారని, 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని పాక్ ను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోయిందని రవీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News