Rajasthan: గాజు పెంకులను చిప్స్ లా నమిలి మింగేస్తున్న రాజస్థాన్ న్యాయవాది.. వీడియో!

  • రాజస్థాన్ లోని దిందోరిలో ఘటన
  • గాజు ముక్కలకు అలవాట పడ్డ సాహో
  • మానేయాలని సూచించిన వైద్యులు

సాధారణంగా గాజు ముక్కలు చేతికి తగిలితేనే ఎక్కడ గాయమవుతుందో అని భయపడతాం. అలాంటి గాజు ముక్కలను నోట్లో వేసుకుని కరకరా నమిలి మింగేస్తే? పదునుగా ఉండే గాజు ముక్కలను చిప్స్ లా తినగలిగితే? వింటేనే భయం పుడుతున్న ఈ పనిని రాజస్థాన్ కు చెందిన ఓ లాయర్ చేతల్లో చేసి చూపిస్తున్నారు. రాజస్థాన్ దిందోరికి చెందిన న్యాయవాది దయారాం సాహూకు గాజు ముక్కలు తినే అలవాటు ఉంది.

ప్రస్తుతం దాన్ని మానేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. గాజు ముక్కలను ఓ పల్లెంలో పెట్టుకునే సాహూ, చిప్స్ తరహాలో వాటిని నమిలి కరకరా మింగేస్తారు. గత 40-45 సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతోంది. అన్నట్లు ఇలా గాజు ముక్కలు తినడం కారణంగా సాహూకు ఒక్కసారి కూడా అనారోగ్యం రాలేదట. కానీ పళ్లు మాత్రం దెబ్బతిన్నాయి. దీంతో వైద్యుల సూచనతో ఈ గాజు ముక్కలు తినే అలవాటును మానేసేందుకు సాహూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

More Telugu News