'ఈ కన్యను తాకాలని చూస్తే...' భయపెడుతున్న 'రాజు గారి గది-3' ట్రయిలర్!

15-09-2019 Sun 12:30
  • హారర్ చిత్రంగా రాజుగారి గది-3
  • ఆకట్టుకున్న అశ్విన్ నటన
  • దెయ్యంగా భయపెడుతున్న అవికా గోర్
అవికా గోర్, అశ్విన్ బాబు ప్రధాన పాత్రల్లో ఓంకార్ నిర్మిస్తున్న 'రాజుగారి గది-3' ట్రయిలర్ విడుదలైంది. ట్రయిలర్ లోనే దెయ్యంగా అవికా గోర్ భయపెడుతోంది. ట్రయిలర్ వినూత్నంగా ఉండి, ఇది హారర్ చిత్రమని చెప్పకనే చెబుతోంది. "ఈ కన్యను తాకాలని చూస్తే... నీకు తప్పదు మరణం" అని అశ్విన్ బాబు చెప్పిన డైలాగ్, దాని ముందు అశ్విన్ నటన, ట్రయిలర్ కు హైలైట్ గా నిలిచాయి. ఈ ట్రయిలర్ ను 4కే రెజల్యూషన్ లో సోషల్ మీడియా వేదికగా, చిత్ర టీమ్ విడుదల చేసింది. దాన్ని మీరూ చూసేయండి.