SGT: ప్రమోషన్ కోసం ఏపీలో ఉపాధ్యాయులు... 12 వేల మంది పరీక్ష రాస్తే, 12 మంది పాస్!

  • ఈ సంవత్సరం జూన్ లో పరీక్ష
  • నెగటివ్ మార్కులతో నష్టపోయిన టీచర్లు
  • 1000 మందికి ఒకరే పాస్!

మరింత అధిక వేతనం, ప్రమోషన్ల కోసం ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్ మెంటల్ పరీక్ష, ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లింది. దాదాపు 12 వేల మంది పరీక్షలు రాయగా, కేవలం 12 మంది మాత్రమే ఉత్తీర్ణత కావడం గమనార్హం. నెగటివ్ మార్కుల కారణంగానే ఇలా జరిగిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ సంవత్సరం జూన్ 5న జీవో (గెజిటెడ్ ఆఫీసర్స్) పరీక్షకు ఎస్జీటీ, ఎస్ఏ టీచర్లు హాజరు కాగా, పరీక్ష రాసిన 1000 మందిలో ఒకరు మాత్రమే పాస్ అయ్యారు.

ఈ పరీక్షలో పాస్ అయితే, సెకండరీ గ్రేడ్ టీచర్లకు 24 సంవత్సరాల పే స్కేల్, స్కూల్ అసిస్టెంట్లకు 12 సంవత్సరాల పే స్కేల్ లభిస్తుంది. ఇందులో ఉత్తీర్ణత కాకుంటే, సర్వీస్ ఎంత ఉన్నా పదోన్నతులు, ఆర్థిక ప్రయోజనాలకు దూరంగా ఉండాల్సిందే. ఇక ఈ పరీక్షల ఫలితాల తరువాత నెగటివ్ మార్కుల విధానాన్ని తొలగించాలని టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

More Telugu News