Andhra Pradesh: వినాయక నిమజ్జనం సందర్భంగా వాగ్వాదం.. కొట్టుకున్న వైసీపీ-టీడీపీ శ్రేణులు!

  • ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘటన
  • తేలప్రోలులో వినాయక నిమజ్జనం ఊరేగింపు
  • పోలీసులకు వైసీపీ శ్రేణుల ఫిర్యాదు

వినాయక నిమజ్జనం వేళ తలెత్తిన వాగ్వాదం ఘర్షణగా మారింది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడిచేసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఉంగుటూరు మండలం, తేలప్రోలు గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిగింది. ఈ ఊరేగింపు సందర్భంగా టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యాలయమున్న వీధి గుండా వెళుతున్నాయి. అయితే ఇరువర్గాల మధ్య ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది.

ఇది కాస్తా ముదరడంతో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకోవడంతో పాటు కర్రలతో దాడిచేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆత్కూరు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గొడవను నిలువరించే క్రమంలో రాళ్లు తగలడంతో ఎస్సై శ్రీనివాసరావు తలకు గాయమైంది. దీంతో పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు తమపై దాడిచేశారని వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

More Telugu News