blood pressure: రక్తపోటులో హెచ్చుతగ్గులకు వేడిమి చికిత్సతో చెక్

  • అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
  • మంచంపై 100 ఫారెన్ హీట్ డిగ్రీల వేడిని ఉత్పత్తి చేసే ప్యాడ్‌లు
  • రక్తపోటులో తగ్గిన హెచ్చుతగ్గులు

రక్తపోటులో హెచ్చుతగ్గులను వేడిమి చికిత్సతో నివారించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. టెన్నెసీలోని వాండర్‌బిల్ట్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రాత్రుళ్లు నిద్రలో రక్తపోటులో అకస్మాత్తుగా వచ్చే హెచ్చుతగ్గులను వేడిమి చికిత్స ద్వారా నివారించవచ్చని తమ పరిశోధనలో వెల్లడైనట్టు అధ్యయనకారులు తెలిపారు.

పరిశోధనలో భాగంగా 76 ఏళ్ల సగటు వయసున్న వ్యక్తులపై అధ్యయనం నిర్వహించారు. అధ్యయనంలో భాగంగా ఒకరు నిద్రించే మంచంపై 100 ఫారన్ హీట్ డిగ్రీల వేడిని ఉత్పత్తి  చేసే ప్యాడ్‌లను అమర్చారు. మరొకరి మంచంపై సాధారణ ప్యాడ్‌లను ఏర్పాటు చేశారు. వేడిని ఉత్పత్తి చేసే ప్యాడ్‌లు అమర్చిన మంచంపై నిద్రించిన వ్యక్తిలో రక్తపోటు సాధారణ స్థితికి రాగా, సాధారణ మంచంపై నిద్రించిన వ్యక్తిలో రక్తపోటు అలానే ఉన్నట్టు పరిశోధనకారులు గుర్తించారు.

More Telugu News