Nirmala Seetharaman: ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది: నిర్మలా సీతారామన్

  • తయారీ రంగం వృద్ధి రేటు 0.6 శాతానికి పడిపోయింది
  • ఎగుమతులపై పన్ను తగ్గింపుపై పునరాలోచిస్తున్నాం
  • క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తో పరిస్థితులు మెరుగుపడతాయి

దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలను తీసుకోబోతున్నామని చెప్పారు. దేశంలో విదేశీ పెట్టుబడులు మరింత పెరగనున్నాయని చెప్పారు. ఆరేళ్లలో కనిష్ఠ వృద్ధి రేటు నమోదయిందని తెలిపారు. తయారీ రంగం వృద్ధి రేటు 0.6 శాతానికి పడిపోయిందని చెప్పారు. అయితే, 2013-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం వృద్ధి రేటు ఆశించిన స్థాయిలోనే ఉందని తెలిపారు. ఎగుమతులపై పన్ను తగ్గింపుపై పునరాలోచిస్తున్నామని చెప్పారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తో పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నామని తెలిపారు.

కొత్త ఎగుమతులకు ప్రోత్సాహక విధానాన్ని అమలు చేస్తామని... ఉపాధిని కల్పించే రంగాలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. టెక్స్ టైల్ రంగానికి ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఈ ఏడాది చివరి వరకు కొనసాగుతాయని తెలిపారు. ఎంఈఐఈఎస్ పథకం అమలుతో ఎగుమతులు భారీగా పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ స్థానం మెరుగుపడిందని వెల్లడించారు. ఈ నెల 19న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

More Telugu News