Andhra Pradesh: సభ్య సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు జగన్ గారూ?: వర్ల రామయ్య

  • ఏపీలో రెండు వార్తా ఛానళ్ల నిలిపివేత
  • ప్రభుత్వమే ఒత్తిడి చేసిందని ఆరోపణలు
  • సర్కారుపై మండిపడ్డ టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ లో ఎంఎస్వో కేబుల్ ఆపరేటర్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లను ఆపేసినట్లు ఆయా ఛానల్ ప్రతినిధులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆపరేటర్లు ఈ చర్య తీసుకున్నారని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలిచే మీడియా గొంతును ప్రభుత్వం పిసికేస్తోందనీ, స్వేచ్ఛకు బేడీలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రోజు ట్విట్టర్ లో వర్లరామయ్య స్పందిస్తూ.. ‘స్వేచ్ఛకు సంకెళ్లా? నిజం చెప్పడం నేరమా? నిర్భయంగా నిలదీస్తే తప్పా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా? ప్రజా పక్షాన నిలిచే మీడియా గొంతు పిసికి, స్వేచ్చకు బేడీలు వేస్తారా? మీకు నచ్చని ఛానళ్ల ప్రసారాలను నిలిపి సభ్య సమాజానికి ఏం సందేశ మిస్తున్నారు ముఖ్యమంత్రి గారు!’ అని నిలదీశారు.

More Telugu News