Venkatesh: 'వాల్మీకి'కి వెంకటేశ్ ప్రమోషన్

  • ఈ నెల 20న విడుదల కానున్న వరుణ్ తేజ్ చిత్రం 'వాల్మీకి'
  • 15వ తేదీన హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న వెంకీ

మెగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం 'వాల్మీకి' ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 15వ తేదీన హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ చిత్రానికి హీరో వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

వెంకీ, వరుణ్ ల కాంబినేషన్లో ఆమధ్య వచ్చిన 'ఎఫ్ 2' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వరుణ్ చిత్రానికి వెంకటేశ్ తన వంతుగా ప్రమోషన్ చేస్తున్నారు. 'వాల్మీకి' చిత్రంలో వరుణ్ సరసన పూజా హెగ్డే నటించింది. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా... హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు.

More Telugu News