Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా తమన్నా 
  • రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి 
  • మొదలైన కాజల్ వెబ్ సీరీస్

*  అందాల తార తమన్నా తాజాగా ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తోంది. విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంలో తమన్నా ఇలా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమె యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించిందట.
*  'కబీర్ సింగ్' (అర్జున్ రెడ్డి రీమేక్) సినిమాతో హిందీలో కూడా హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరో హిందీ చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని కలసి ఓ కథ వినిపించాడు.
*  కథానాయిక కాజల్ అగర్వాల్ తొలిసారిగా ఓ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందే ఈ వెబ్ సీరీస్ షూటింగ్ నిన్న చెన్నైలో మొదలైంది.

More Telugu News