USA: 22 ఏళ్ల నాటి మిస్సింగ్ కేసును ఛేదించిన గూగుల్ ఎర్త్!

  • 1997లో మిస్సయిన విలియం మోల్డిట్
  • చెరువులో మునిగిపోయిన కారు గూగుల్ ఎర్త్ లో కనిపించిన వైనం
  • కారులో అస్థిపంజరం
  • మోల్డిట్ దేనని గుర్తించిన పోలీసులు

గూగుల్ ఎర్త్ సాయంతో ప్రపంచాన్ని 360 డిగ్రీల్లో వీక్షించడం తెలిసిన విషయమే. అయితే, ఓ వ్యక్తి గూగుల్ ఎర్త్ లో చూస్తుండగా, నీటిలో మునిగిన కారు కనిపించడం, ఆ కారులో ఓ అస్థిపంజరం బయటపడడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ సంఘటన.

1997 నవంబరు 7న ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్ కు చెందిన విలియ్ ఎర్ల్ మోల్డిట్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఓ నైట్ క్లబ్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో అతడి ఆచూకీ లభ్యం కాలేదు. విలియం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు.

సీన్ కట్ చేస్తే... ఓ స్థిరాస్తి సర్వేయర్ గూగుల్ ఎర్త్ లో మూన్ బే ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా ఓ చెరువులో కారు మునిగిపోయి ఉండడం గుర్తించాడు. ఈ విషయాన్ని పామ్ బీచ్ పోలీసులకు తెలిపాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ కారును బయటికి తీయగా, అందులో ఓ వ్యక్తి అస్థిపంజరం దర్శనమిచ్చింది.  ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం అది 22 ఏళ్ల క్రితం మిస్సయిన విలియం మోల్డిట్ దని తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది.

More Telugu News