Andhra Pradesh: ఏపీలో 18 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు

  • వైసీపీ అధికారం చేపట్టాక ఉన్నతాధికారులకు స్థానచలనం
  • మరోసారి ఐఏఎస్ ల బదిలీలు
  • అజయ్ జైన్ కు హౌసింగ్ విభాగం
  • పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే

ఏపీలో వైసీపీ అధికారం చేపట్టాక కీలక స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులకు స్థానచలనం తప్పలేదు. తాజాగా మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఏపీలో 18 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జి.అనంతరామును మాత్రం జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.

బదిలీ అయిన అధికారులు వీరే...

  • అజయ్ జైన్- హౌసింగ్ ముఖ్య కార్యదర్శి
  • కాంతిలాల్ దండే- పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి
  • పి.ఉషా కుమారి- ఆయుష్ కమిషనర్
  • జి.రేఖారాణి- కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్
  • భానుప్రకాశ్- గిడ్డంగుల కార్పొరేషన్ వీసీఎండీ
  • కె.శారదాదేవి-మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్
  • సుమిత్ కుమార్-ఏపీ ఫైబర్ నెట్ ఎండీ
  • డి.వాసుదేవరెడ్డి-ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ
  • సిద్ధార్థ జైన్-స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్
  • చెరుకూరి శ్రీధర్-ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ సెక్రటరీ
  • ఎం.మధుసూదన్ రెడ్డి-ఏపీ మినరల్ కార్పొరేషన్ వీసీఎండీ
  • ఎంఏ కిశోర్-రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
  • పీఏ శోభ-గిరిజన సహకార సంస్థ వీసీఎండీ
  • ఎల్ఎస్ బాలాజీరావు-మార్క్ ఫెడ్, ఆగ్రోస్ ఎండీ
  • టి.బాబూరావు నాయుడు-పునరావాస శాఖ ప్రత్యేక కమిషనర్
  • నందకిశోర్-ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ ఎండీ
  • వి.రామకృష్ణ-ఇంటర్మీడియట్ విద్య స్పెషల్ కమిషనర్
  • ఎన్.చంద్రమోహన్ రెడ్డి-ఏపీ యూఎఫ్ఐడీసీ ఎండీ

More Telugu News