Nani: 'వి' సినిమా కోసం థాయ్ లాండ్ వెళ్లనున్న నాని

  • ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి క్రైమ్ థ్రిల్లర్ 
  • థాయ్ లాండ్ లో జరుగుతోన్న షూటింగ్ 
  • నాయికలుగా నివేదా థామస్ - అదితీరావు

నాని తాజా చిత్రంగా రూపొందిన 'గ్యాంగ్ లీడర్' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నాని తన తదుపరి సినిమా షూటింగుకి సిద్ధమవుతున్నాడు. నాని తదుపరి చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. 'వి' అనే టైటిల్ తో ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందుతోంది.

ఈ సినిమాలో సుధీర్ బాబు - నాని ఇద్దరూ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు థాయ్ లాండ్ లో జరుగుతోంది. సుధీర్ బాబు కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే నాని అక్కడ జరుగుతోన్న షూటింగులో జాయిన్ కానున్నాడు. నాని - సుధీర్ బాబు కాంబినేషన్లో అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. నాని పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా వుంటుందనే టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో, నివేదా థామస్ .. అదితీరావు హైదరి కథానాయికలుగా కనిపించనున్నారు.

More Telugu News