Sensex: వారాంతాన్ని లాభాల్లో ముగించిన మార్కెట్లు

  • 281 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 93 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • మార్కెట్లను నడిపించిన బ్యాంకింగ్ రంగం

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నష్టాల్లో ఉన్న మార్కెట్లు... ఆ తర్వాత బ్యాంకింగ్ సూచీల అండతో లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 281 పాయింట్లు లాభపడి 37,385కి ఎగబాకింది. నిఫ్టీ 93 పాయిట్లు లాభపడి 11,076కి చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత లిమిటెడ్ (2.72%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.61%), ఓఎన్జీసీ (2.34%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.79%), ఎస్బీఐ (1.69%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.41%), భారతి ఎయిర్ టెల్ (-0.83%), హెచ్డీఎఫ్సీ (-0.46%), ఐటీసీ (-0.35%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.10%).

More Telugu News