Gang leader: ‘గ్యాంగ్ లీడర్’ హిట్టయితే నిద్రలేపండి.. లేదంటే డిస్టర్బ్ చేయవద్దు!: హీరో నాని

  • నేడు విడుదలైన గ్యాంగ్ లీడర్
  • సీనియర్ నటి లక్ష్మితో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన నటుడు
  • దర్శకత్వం వహించిన విక్రమ్ కె.కుమార్

నాని, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా నేడు విడుదలైంది. ఈ నేపథ్యంలో నాని ట్విట్టర్ లో ఫన్నీగా స్పందించాడు. ‘సినిమా సూపర్ హిట్ అయితే నిద్రలేపండి. లేదంటే డిస్టర్బ్ చేయవద్దు’ అని సీనియర్ నటి లక్ష్మితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా ప్రధాన పాత్రలు పోషించగా, ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాని రివెంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారథిగా ప్రేక్షకులను అలరించనున్నాడు.

More Telugu News