Telangana: నల్లమలలో యురేనియం వ్యతిరేక ఉద్యమం.. జనసైనికులకు ఎమ్మెల్యే రాపాక కీలక సూచన!

  • ఉద్యమానికి జనసేన చీఫ్ పవన్ మద్దతు
  • డీపీలను మార్చుకోవాలని రాపాక పిలుపు
  • ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచన

నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణలోని ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం మద్దతు ప్రకటించారు. తాజాగా ఈ విషయమై రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పందించారు.

నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో జనసైనికులు అవగాహన కల్పించాలని రాపాక సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియాలో తమ డీపీలను ‘సేవ్ నల్లమల’గా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్టర్ లో స్పందించిన రాపాక  Stop Uranium Mining, Save Nallamalla అనే ట్యాగ్ లను షేర్ చేశారు.

More Telugu News