Dena Bank: ముంబైలోని దేనా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ను విక్రయానికి పెట్టిన బ్యాంక్ ఆఫ్ బరోడా!

  • ముంబైలో ప్రధాన కార్యాలయం
  • రూ. 530 కోట్లకు రిజర్వ్ ప్రైస్
  • అక్టోబర్ 18న వేలం

ఈ సంవత్సరం ఏప్రిల్ లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ విలీనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో ఉన్న దేనా బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని వేలం ద్వారా విక్రయించాలని బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణయించింది. ముంబైలోని లగ్జరీ ప్రాంతాల్లో ఒకటైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో దాదాపు 2,876 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భవంతిని రూ. 530 కోట్లకు వేలం వేయాలని భావిస్తూ, బిడ్లను ఆహ్వానించింది. ఈ మేరకు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.

రిజర్వ్ ప్రైస్ పై అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి భవంతి దక్కనుంది. ఈ భవంతి బిల్ట్ అప్ ఏరియా 9,953 చదరపు మీటర్లని బ్యాంకు పేర్కొంది. అక్టోబర్ 18న వేలం నిర్వహిస్తామని, భవంతిలోని మూవబుల్ ఫర్నీచర్ మాత్రం ఆస్తిలో భాగం కాదని స్పష్టం చేసింది.

More Telugu News