Banks: ఈ నెలలో రెండు రోజుల బ్యాంకుల సమ్మె... వరుసగా నాలుగు రోజులు మూత!

  • 26, 27 తేదీల్లో సమ్మెకు నోటీసులు
  • ఆపై శని, ఆదివారాలు
  • పలు బ్యాంకుల కార్యకలాపాలకు విఘాతం
  • నోటీసులిచ్చిన నాలుగు ట్రేడ్ యూనియన్ సంఘాలు

ప్రభుత‍్వ బ్యాంకుల విలీనాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలు మరోసారి తమ నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయించాయి. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయనున్నట్టు ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ, నాలుగు బ్యాంక్ ఆఫీసర్స్ ట్రేడ్ యూనియన్ సంస్థలు రెండు రోజుల నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ కు నోటీసులిచ్చాయి.

ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ అర్ధరాత్రి వరకూ సమ్మెకు ఈ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో, 26న గురువారం, 27న శుక్రవారం, 28న నాలుగో శనివారం, 29న ఆదివారం దేశవ్యాప్తంగా పలు బ్యాంకులు పూర్తిగా మూతబడనున్నాయి. ఇతర బ్యాంకుల సేవలకు విఘాతం కలగనుంది.

కాగా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్‌ఓబీఓ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ)లు సమ్మె చేపట్టనున్నాయి.

More Telugu News