DGGI: 'జీఎస్‌టీ'లో తప్పుడు లెక్కలు.. హైదరాబాద్‌లో 8 కార్యాలయాలపై అధికారుల దాడులు

  • డీజీజీఐ, డీఆర్ఐలు ఏకకాలంలో దాడులు
  • 15 రాష్ట్రాల్లో 336 ప్రాంతాల్లో తనిఖీలు
  • పాల్గొన్న 1200 మంది అధికారులు

డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లు కలిసి దేశవ్యాప్తంగా సంయుక్త తనిఖీలు నిర్వహించాయి. తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లోని 336 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా, 1200 మంది అధికారులు ఇందులో పాల్గొన్నారు. కొందరు ఎగుమతిదారులు తప్పుడు పద్ధతుల్లో జీఎస్‌టీ రిఫండ్‌ను కోరుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని పొందేందుకు అర్హత లేని, నకిలీ సరఫరాలతో కొందరు ఎగుమతులు చేసినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాదు, కొందరు వ్యాపారులైతే రూ.3500 కోట్ల విలువైన ఇన్‌వాయిస్‌లపై ఏకంగా రూ.470 కోట్లను ఐటీసీ రూపంలో వెనక్కి తీసుకున్నట్టు గుర్తించిన అధికారులు విస్తుపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు నిర్వహించారు. ఇక, హైదరాబాద్, సికింద్రాబాద్, బేగంబజార్ ప్రాంతాల్లో ముగ్గురు మొబైల్ డీలర్లకు చెందిన 8 కార్యాలయాలపైనా అధికారులు దాడులు నిర్వహించారు.

More Telugu News