మోదీ కాలుపెట్టారు... చంద్రయాన్-2 నాశనమైంది: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

12-09-2019 Thu 21:57
  • ఇస్రో కేంద్రంలో మోదీ కాలుపెట్టడమే దురదృష్ట హేతువన్న కుమారస్వామి
  • సైంటిస్టులను శని పట్టుకుందంటూ వ్యాఖ్యలు
  • మోదీ కారణంగా అంతా నాశనం అయిందన్న మాజీ సీఎం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణంగానే చంద్రయాన్-2లో వైఫల్యం చోటుచేసుకుందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. బెంగళూరు ఇస్రో కేంద్రంలో మోదీ కాలుపెట్టిన వేళా విశేషం కారణంగా సైంటిస్టులను శని పట్టుకుందని అన్నారు. చంద్రయాన్-2 ఘనత తనదేనని చెప్పుకోవడానికే మోదీ బెంగళూరు వచ్చారని కుమారస్వామి ఆరోపించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు 12 ఏళ్లు ఎంతో కృషి చేశారని, మోదీ కారణంగా అంతా నాశనం అయిందని తెలిపారు. మైసూరులో జరిగిన ఓ సభలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.