Prime Minister: ఈ వంద రోజుల పాలన కేవలం ట్రైలరే..అసలు సినిమా ముందుంది: ప్రధాని మోదీ

  • తీవ్రవాద నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేశాం
  • జమ్మూకశ్మీర్, లడక్ లో అభివృద్ధికి చర్యలు చేపట్టాం
  • జార్ఖండ్ వేదికగా కొత్త పథకాలను ప్రారంభించిన మోదీ

జార్ఖండ్ వేదికగా 'ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధర్ యోజన', 'లఘు వ్యాపారి మాన్ ధన్' పథకాలను మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పని చేసే సత్తా ఉన్న, దమ్మున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాను ప్రజలకు మాటిచ్చానని, ఈ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ లాంటిదే అని, అసలు సినిమా ముందుంది అని అన్నారు.

తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తాము సంకల్పించుకున్నామని, అందులో భాగంగా తీవ్రవాద నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేశామని చెప్పారు. జమ్మూకశ్మీర్, లడక్ లో అభివృద్ధిని నూతన శిఖరాలకు తీసుకెళ్లాలని సంకల్పించుకున్నామని, ఈ వంద రోజుల్లో ఆ దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. ప్రజలను దోచుకున్న వారిని సరైన స్థానాలకు పంపిస్తామని, ఆ ప్రకియ కూడా మొదలైందని, ఇప్పటికే కొందరు జైలుకి కూడా వెళ్లారని అన్నారు. తమ ప్రభుత్వం దేశాన్ని తిరోగమనంలోకి తీసుకువెళ్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.

More Telugu News