'వాల్మీకి' సాంగ్.. ‘దడ దడ దడ దంచుడే..’ విడుదల

Thu, Sep 12, 2019, 05:49 PM
  • 'వాల్మీకి'లో సాంగ్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
  • చంద్రబోస్ పాటకు మిక్కీ జే మేయర్ సంగీతం
  • ఈ నెల 20న విడుదల కానున్న ‘వాల్మీకి’
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'వాల్మీకి'. ఈ చిత్రంలోని ఓ సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘దడ దడ దడ దంచుడే.. గుండెల్లోకి పిడి దించుడే..అడ్డమొచ్చినోడ్ని సంపుడే..’ అంటూ ఈ పాట కొనసాగింది. ఈ పాట గద్దల కొండ గణేశ్ (ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర) ను నిర్వచిస్తుంది, వివరిస్తుంది అని హరీశ్ శంకర్ పేర్కొన్నారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను మిక్కీ జే మేయర్ స్వరపరిచారు. కాగా, ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి నాయికగా పూజా హెగ్డే నటించింది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad