Nallamala: గడ్డిపోచ కూడా మొలవదు... నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై అనసూయ ఆందోళన

  • నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
  • గళం విప్పిన యాంకర్ అనసూయ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వేల ఎకరాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా, ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్ కూడా ఈ అంశంపై స్పందించారు. నల్లమలలో రేడియో ధార్మిక యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడం ద్వారా అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.

యురేనియం తవ్వకాల కోసం తెలుగు రాష్ట్రాల్లో చాలా భాగం అడవి నరికివేతకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆ భూమి అణు ప్రభావానికి గురైతే అక్కడ గడ్డిపోచ కూడా మొలవదని, భూసారం క్షీణించిపోతుందని తెలిపారు. పూర్తిగా బీడు భూమిగా మారిపోతుందని, దాంతోపాటే నాగార్జున సాగర్-శ్రీశైలం పులుల సంరక్షణ ప్రాంతం కూడా నాశనం అవుతుందని హెచ్చరించారు.

ఈ ప్రాంతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పులులు సంరక్షణ కేంద్రంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా, మన్ననూరు గిరిజన ప్రాంతం యురేనియం తవ్వకాల ప్రభావంతో ప్రమాదకర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అనసూయ తన పోస్టులో వివరించారు.


More Telugu News