India: తమకు 58 దేశాలు మద్దతు పలికాయని చెప్పుకుంటున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

  • ఆర్టికల్ 370 రద్దుతో ఉడికిపోతున్న పాక్
  • అంతర్జాతీయంగా పాక్ పై ఒత్తిళ్లు!
  • తమ వాదనే సరైందంటున్న పాక్ ప్రభుత్వం

కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం భారతదేశ అంతర్గత వ్యవహారమని పాకిస్థాన్ ఇప్పటికీ అంగీకరించలేకపోతోంది. దీనిపై అంతర్జాతీయంగా అనేక ఎదురుదెబ్బలు తగిలినా పాకిస్థాన్ మాత్రం తన వాదనే సరైందన్న భావనలో ఉంది. పాక్ నేతల ప్రకటనలే అందుకు నిదర్శనం. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబరు 10న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో తమకు మద్దతుగా 58 దేశాలు నిలిచాయని పేర్కొన్నారు.

కశ్మీర్ లో అణచివేత నిలిపివేయడం, నిర్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షల తొలగింపు, కశ్మీరీల హక్కులను గౌరవించడం, రక్షించడం, భద్రతామండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకోవడం వంటి అంశాలపై భారత్ తక్షణమే స్పందించాలన్న తమ డిమాండ్ కు ఆ 58 దేశాలు మద్దతుగా నిలవడం పట్ల తాను గౌరవభావం ప్రకటిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

భద్రతామండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు, ద్వైపాక్షిక ఒప్పందాలను అనుసరించి కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న యూరోపియన్ యూనియన్ (ఈయూ) సూచనను తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.

More Telugu News