India: ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ లోకి దూసుకెళతాం.. పీవోకేను స్వాధీనం చేసుకుంటాం!: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

  • కేంద్ర ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి
  • ప్రభుత్వం ఆదేశిస్తే పాటించేందుకు ఆర్మీ సిద్ధం
  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన భారత ఆర్మీ చీఫ్

భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)కు విముక్తి కల్పిస్తామనీ, పాకిస్థాన్ చెర నుంచి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటించేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. పాక్ నుంచి పీవోకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో జితేంద్ర సింగ్ వ్యాఖ్యలపై ఢిల్లీలో రావత్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

‘పీవోకేను పాకిస్థాన్ నుంచి స్వాధీనం చేసుకుని భారత్ లో అంతర్భాగం చేయడమే మా తదుపరి అజెండా. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే దేశంలోని వ్యవస్థలు నడుచుకుంటాయి. ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేసేందుకు ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమే’ అని రావత్ ప్రకటించారు.

More Telugu News