Water found: అచ్చం మన భూమిలాగే.. సూదూర గ్రహంపై నీటి జాడను కనుగొన్న శాస్త్రవేత్తలు!

  • ఆవిరి రూపంలో నీరు ఉన్నట్లు గుర్తింపు
  • గ్రహానికి  ‘కే2-18బీ’గా నామకరణం
  • సరైన ఉష్ణోగ్రత, జీవరాశి మనుగడకు అనువైన వాతావరణం

‘మనలాంటి తెలివైన గ్రహాంతర జీవులు ఈ విశ్వంలో ఉన్నాయా?’.. 21వ శతాబ్దంలో మనిషిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్న ఇది. అదే సమయంలో భూమిపై సహజ వనరులు తరిగిపోతే, భూమిలాగే ఉండే మరో గ్రహాన్ని వెతికేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు తమ అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో మరో సౌర వ్యవస్థలో అచ్చం భూమిలాగే నీటి జాడ ఉండే గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ‘కే2-18బీ’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ గ్రహం ద్రవ్యరాశి భూమికి 8 రెట్లు అధికంగా ఉందని తెలిపారు. హబుల్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహంపై నీటి ఆవిరి జాడలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.

ఈ గ్రహంపై నెఫ్ట్యూన్ తరహాలో మంచు గడ్డకట్టి ఉండొచ్చనీ, లేదంటే హైడ్రోజన్ అధికంగా ఉండే వాతావరణం అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు. భూమితో పోల్చుకుంటే ఈ గ్రహం తన నక్షత్రానికి ఏడు రెట్లు దగ్గరగా ఉందనీ, అయినా ఈ  ‘కే2-18బీ’ నివాసయోగ్యంగానే ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 116 ఫారిన్ హీట్ నుంచి 100 ఫారిన్ హీట్ వరకూ ఉంటుందని పేర్కొన్నారు.

ఈ గ్రహాన్ని నాసా 2015లో గుర్తించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ గ్రహంపై తమకు జీవం జాడ కనిపించలేదన్నారు. అయితే ఈ గ్రహానికి చేరుకోవాలంటే మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే ఇది మన సౌర వ్యవస్థకు సుమారు 111 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

More Telugu News