నేను బీజేపీలో చేరుతున్నా.. జగన్ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి: ఆదినారాయణరెడ్డి

12-09-2019 Thu 12:21
  • బీజేపీలో చేరుతున్నానని చంద్రబాబుకు చెప్పాను
  • జగన్ దాష్టీకాలను ఎదుర్కోవడానికి బీజేపీలాంటి పార్టీ అవసరం
  • అనుచరుల కోసమే పార్టీ మారుతున్నా

తాను బీజేపీలో చేరుతున్నానని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పానని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీతో తనకు విభేదాలు లేవని... స్థానిక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని... జగన్ దాష్టీకాలను ఎదుర్కోవాలంటే బీజేపీలాంటి గట్టి పార్టీ అవసరమని తెలిపారు. తన అనుచరుల కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరాలా? లేక తన నియోజకవర్గంలో బహిరంగసభ ఏర్పాటు చేసి చేరాలా? అనే విషయంపై ఈరోజు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.