Prabhas: ప్రభాస్ కొత్త సినిమా కోసం ఎన్ని సెట్స్ వేశారో తెలిస్తే షాక్ అవుతారు!

  • రూ. 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రభాస్ కొత్త చిత్రం
  • హైదరాబాద్ లో 25 సెట్స్ నిర్మాణం
  • 1960 నాటి కథతో తెరకెక్కుతున్న సినిమా

భారీ వసూళ్లతో ప్రభాస్ చిత్రం 'సాహో' దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ప్రభాస్ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. రూ. 180 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. 1960 కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దాదాపు 25 సెట్స్ నిర్మించినట్టు తెలుస్తోంది. ప్రతి సెట్ కూడా అద్భుతంగా ఉందంటున్నారు. హైదరాబాద్ లోనే ఈ సెట్స్ వేశారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

More Telugu News