Sairaa: 'సైరా'... ఒక టికెట్ కొంటే, మరో టికెట్ ఉచితం... ఎక్కడో తెలుసా?

  • అమెరికాలో అక్టోబర్ 1నే విడుదల
  • టికెట్లు విక్రయిస్తున్న ఏటీ అండ్ టీ
  • ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించిన సంస్థ

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తన 151వ చిత్రంగా నటిస్తున్న 'సైరా', వచ్చేనెల 2వ తేదీన విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చిరంజీవి కుమారుడు, హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఒక టికెట్ కొంటే మరో టికెట్ ను ఉచితంగా ఇవ్వాలని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. అది కూడా సినిమా రిలీజ్ రోజునే.

అమెరికాలో ఏటీ అండ్ టీ సంస్థ 'సైరా' టికెట్లను ఆన్ లైన్లో విక్రయిస్తోంది. అక్టోబర్ 1నే అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది. ఆ రోజు సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. వాస్తవానికి ఆరోజు మంగళవారం. అంటే, అందరూ ఉద్యోగాలకు వెళ్లే రోజు. ఆ రోజున ఎవరూ సినిమాలు చూసేందుకు ఇష్టపడరు. అందుకే అమెరికాలో పలు సంస్థలు మంగళవారం నాడు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంటాయి. అందులో భాగంగానే 'సైరా'కు కూడా ఆఫర్ వచ్చింది. ఇక ఈ ఆఫర్ ను ఎంతమంది వినియోగించుకుంటారో చూడాలి.

More Telugu News