'సైరా'... ఒక టికెట్ కొంటే, మరో టికెట్ ఉచితం... ఎక్కడో తెలుసా?

- అమెరికాలో అక్టోబర్ 1నే విడుదల
- టికెట్లు విక్రయిస్తున్న ఏటీ అండ్ టీ
- ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించిన సంస్థ
అమెరికాలో ఏటీ అండ్ టీ సంస్థ 'సైరా' టికెట్లను ఆన్ లైన్లో విక్రయిస్తోంది. అక్టోబర్ 1నే అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది. ఆ రోజు సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. వాస్తవానికి ఆరోజు మంగళవారం. అంటే, అందరూ ఉద్యోగాలకు వెళ్లే రోజు. ఆ రోజున ఎవరూ సినిమాలు చూసేందుకు ఇష్టపడరు. అందుకే అమెరికాలో పలు సంస్థలు మంగళవారం నాడు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంటాయి. అందులో భాగంగానే 'సైరా'కు కూడా ఆఫర్ వచ్చింది. ఇక ఈ ఆఫర్ ను ఎంతమంది వినియోగించుకుంటారో చూడాలి.