Maha Ganapati: లక్డీకపూల్ కి చేరుకున్న శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతి... 12లోపే నిమజ్జనం!

  • 11 రోజులు పూజలందుకున్న శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి
  • ఈ ఉదయం 6 గంటలకు మొదలైన శోభాయాత్ర
  • నిమజ్జనానికి ప్రత్యేక క్రేన్ ఏర్పాటు

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కొలువై, 11 రోజుల పాటు భక్తుల పూజలందుకుని, దాదాపు రెండు కోట్ల మంది దర్శించుకున్న శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నిన్న సాయంత్రం 8 గంటల సమయానికే, చుట్టూ ఉన్న షెడ్డును తొలగించిన నిర్వాహకులు, ఆపై రాత్రి 12 గంటలకు భక్తుల దర్శనాలను నిలిపివేశారు.

ఆ తరువాత భారీ క్రేన్ సాయంతో విగ్రహాన్ని పట్టివుంచి, మెటల్ బీమ్స్ కటింగ్ పనులు ప్రారంభించారు. తెల్లవారుజామున 5 గంటలకు విగ్రహాన్ని ప్రత్యేక లారీపైకి ఎక్కించారు. ఆపై భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం లక్డీకపూల్ లోని ఓల్డ్ మీరా థియేటర్ సమీపానికి శోభాయాత్ర చేరుకుంది. ఉదయం 11 గంటలలోపే ఎన్టీఆర్ మార్గ్‌ లోని క్రేన్ నెంబర్ 6 దగ్గరకు ఖైరతాబాద్ మహా గణపతి చేరుకుంటాడని అధికారులు తెలిపారు. ఆపై గంట వ్యవధిలోనే ప్రత్యేక పూజలు, నిమజ్జనం పూర్తి కానున్నాయి.

More Telugu News