రేపు బీజేపీలో చేరనున్న టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి?

11-09-2019 Wed 19:41
  • హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన ఆదినారాయణరెడ్డి
  • అమిత్ షా సమక్షంలో రేపు బీజేపీలో చేరిక
  • మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఓటమి

కడప జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆ పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు హుటాహుటిన ఆయన ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో రేపు బీజేపీలో ఆయన చేరనున్నట్టు సమాచారం. కాగా, మొన్నటి  లోక్ సభ ఎన్నికల్లో కడప లోక్ సభ సీటు నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచీ ఆయన బీజేపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాను బీజేపీలో చేరబోతున్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే ఆయన చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.