High Court: ఏపీలో జ్యుడీషియల్ కమిషన్.. ప్రివ్యూ ప్రక్రియకు జస్టిస్ శివశంకరరావు నియామకం

  • టెండర్లలో అవినీతికి చోటు లేకుండా ఉండేందుకు జ్యుడీషియల్ కమిషన్  
  •  హైకోర్టును సంప్రదించిన మీదట నియామకం
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు  

టెండర్లలో అవినీతికి ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని తీసుకు వచ్చేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఏర్పాటులో కీలక అడుగు పడింది. జ్యుడీషియల్ ప్రివ్యూ ప్రక్రియకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావును నియమించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు ఆయన్నిప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వంద కోట్లు దాటిన ప్రతి టెండర్ ను జ్యుడీషియల్ కమిషన్ సమీక్షిస్తుంది. కమిషన్ ఆమోదం పొందిన తర్వాతే టెండర్లు ముందుకు సాగుతాయి.

More Telugu News