Pakistan: మా ఆటగాళ్ల నిర్ణయం వెనుక ఇండియా లేదు: పాకిస్థాన్ వ్యాఖ్యలను ఖండించిన శ్రీలంక

  • మా ఆటగాళ్లపై భారత్ ఒత్తిడి చేయలేదు
  • ఉగ్రదాడి కారణంగా పాక్ లో పర్యటించేందుకు వారు భయపడుతున్నారు
  • పాక్ ను పాక్ గడ్డపై ఓడిస్తామనే నమ్మకం ఉంది

పాకిస్థాన్ లో పర్యటించకుండా తమ ఆటగాళ్లపై భారత్ ఎలాంటి ఒత్తిడి చేయలేదని శ్రీలంక క్రీడామంత్రి హరిన్ ఫెర్నాండో తెలిపారు. 2009 శ్రీలంక పర్యటన సందర్భంలో ఉగ్రదాడి జరిగిన కారణంగానే అక్కడ పర్యటించేందుకు తమ ఆటగాళ్లు భయపడుతున్నారని చెప్పారు. తమ ఆటగాళ్ల అభిప్రాయాలను తాము గౌరవిస్తామని... పాక్ లో పర్యటించేందుకు ఆసక్తి చూపినవారినే ఎంపిక చేశామని తెలిపారు. పాక్ ను పాక్ గడ్డపై ఓడిస్తామనే నమ్మకం ఉందని చెప్పారు.

శ్రీలంకలో పర్యటించేందుకు ఏంజెలో మాథ్యూస్, లసిత్ మలింగ, దినేశ్ చండిమాల్, దిముతు కరుణరత్నె, అఖిల ధనంజయ, కుశాల్ పెరీరా, నిరోషన్ డిక్వెలా, తిసారా పెరీరా, సురంగ లక్మల్ లు అయిష్టతను వ్యక్తం చేశారు. భద్రతా కారణాల వల్ల తాము పాక్ లో పర్యటించలేమని స్పష్టం చేశారు.

More Telugu News