Andhra Pradesh: ముద్రగడను హౌస్ అరెస్ట్ చేసి ఆడవాళ్లను పోలీసులతో బూతులు తిట్టించారు.. అప్పుడు హక్కులు గుర్తుకురాలేదా?: విజయసాయిరెడ్డి

  • తమ నిర్బంధం ప్రజాస్వామ్యంలో చీకటిరోజన్న బాబు
  • చంద్రబాబు విమర్శలను తిప్పికొట్టిన వైసీపీ నేత
  • జగన్ ఎయిర్ పోర్టు అరెస్ట్ ఘటన ప్రస్తావన

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శల దాడి కొనసాగుతోంది. తనను ఉండవల్లిలో ఈరోజు నిర్బంధించడంపై చంద్రబాబు స్పందిస్తూ..‘ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు’ అని వ్యాఖ్యానించారు. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలకు సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. చీకటి రోజుల గురించి చంద్రబాబే చెప్పాలని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.

ప్రత్యేక హోదా ఉద్యమం సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అక్రమంగా అరెస్ట్ చేశారనీ, అది చంద్రబాబు దృష్టిలో వెలుతురు రోజా? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను హౌస్ అరెస్ట్ చేసి, వాళ్ల ఇంట్లోని ఆడవాళ్లను పోలీసులతో బూతులు తిట్టించినప్పుడు వాళ్ల హక్కులు గుర్తుకురాలేదా? అని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులను ట్యాగ్ చేశారు.

More Telugu News