Telugudesam: ‘ఛలో ఆత్మకూరు’లో వివాదం.. నన్నపనేని కులం పేరుతో దూషించారని మహిళా ఎస్సై ఆగ్రహం!

  • చంద్రబాబు నివాసం వద్ద 144 సెక్షన్
  • టీడీపీ మహిళా నేతలతో కలిసి వచ్చిన నన్నపనేని
  • దళితులంటూ దూషించారని ఎస్సై ఆరోపణ

తెలుగుదేశం పార్టీ ఈరోజు ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు చంద్రబాబు, లోకేశ్, కేశినేని నాని, భూమా అఖిలప్రియ, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల్ని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ లను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యతో టీడీపీ నేత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి  ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా  స్థానిక మహిళా ఎస్సై అనురాధ  తనపై నన్నపనేని రాజకుమారి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ  ఒక్కసారిగా  భగ్గుమన్నారు.

‘ఏం అన్నారు మీరు? మేం దళితులమా? పబ్లిక్ సర్వెంట్లం మేము. మేం దళితులమా మీకు? ఆమె వేలు చూపించి చెబుతుంటే మీరు(టీడీపీ మహిళా నేతలు) మొత్తం చూస్తున్నారు. కష్టపడి మేం ఉద్యోగం సాధించాం. మీలాగా కాదు. ఏందయ్యా. ఏంటి చెప్పు. ఏం మాట్లాడుతున్నావ్. ఆమె(నన్నపనేని రాజకుమారి) ఏం చెప్పింది? ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేసింది. మేము దళితులమా? మీడియా మొత్తం చూస్తుండగా వేలు చూపిస్తారా?’ అంటూ నిప్పులు చెరిగారు. దీంతో అప్పటివరకూ ఉత్సాహంగా ఉన్న నన్నపనేని రాజకుమారి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

More Telugu News