Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో... ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఒప్పందం!

  • 30 నుంచి బ్రహ్మోత్సవాలు
  • భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు
  • తమిళనాడుకు మరిన్ని బస్సులు

ఈ నెల 30 నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. తిరుపతి రీజనల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన చర్చల తరువాత, భక్తులకు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సులు నడిపేందుకు డీల్ కుదిరింది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు మార్చుకున్నారు.

కాగా, బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 8 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య 150 ప్రత్యేక బస్సులు నడపాలని అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక ఈ బస్సులను ఏఏ రూట్లలో నడపాలన్న విషయాలపైనా అధికారులు చర్చించారు. ఇక, 18 నుంచి వచ్చే నెల 17వ వరకు పెరటాశి మాసం కావడంతో, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు అదనపు ట్రిప్పులు నడపాలని కూడా అధికారులు నిర్ణయించారు.

More Telugu News